
పాలమూరు, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లాకు కేంద్ర బలగాలు వచ్చినట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బలగాలను సాదరంగా ఆహ్వానించి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహించాల్సిన విధులను వివరించారు. ప్రజల్లో నమ్మకం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ట్రైనీ ఐపీఎస్ చిత్తరంజన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్ కుమార్ పాల్గొన్నారు.