రూ.8 వేల కోట్లు సేకరించనున్న కేంద్ర ప్రభుత్వం సంస్థ ఐఐఎఫ్ఎల్​

రూ.8 వేల కోట్లు సేకరించనున్న కేంద్ర ప్రభుత్వం సంస్థ ఐఐఎఫ్ఎల్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫైనాన్స్​ కంపెనీ లిమిటెడ్​(ఐఐఎఫ్​ఎల్​) దేశవిదేశీ సంస్థల నుంచి అప్పుల  ద్వారా రూ.8 వేల కోట్లు సేకరించనున్నట్టు ప్రకటించింది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ గ్రోత్​ను 20 శాతం పెంచడానికి కంపెనీ రూ.29 వేల కోట్లు సేకరించాలని నిర్ణయించింది. గత మూడు క్వార్టర్లలో 75 శాతం నిధులను సేకరించింది. మిగతా రూ.8 వేల కోట్లను ప్రస్తుత క్వార్టర్​లో సేకరిస్తామని ఐఐఎఫ్​ఎల్​ఎండీ పీఆర్ ​జైశంకర్​ చెప్పారు. 

అంతేగాక ఆసియన్​డెవెలప్​మెంట్​ బ్యాంక్​,  ​ఎగ్జిమ్​ బ్యాంక్ ​ద్వారా 600 బిలియన్​ డాలర్లు సేకరిస్తామని చెప్పారు.