తెలంగాణ రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా పని చేస్తు్న్న డీజీ శిఖా గోయల్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డ్ లభించింది. సైబర్ క్రైమ్స్ అనాలసిస్ చేయడంలో వాటిని అడ్డుకోవడానికి ఆమె చేసిన కృషికి ఈ అవార్డ్ వచ్చింది. న్యూ ఢిల్లీ విజ్హన్ భవన్ లో ఇండియన్ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అవార్డు పొందారు ఆమె. కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా చేతుల మీదుగా డీజీ శిఖా గోయల్ అవార్డు అందుకున్నారు.
సైబర్ క్రైమ్ అనాలసిస్, క్రిమినల్ నెట్ వర్క్ ను గుర్తించడం ద్వారా నేరాలపై విశ్లేషణ చేయడంలో శిఖా గోయల్ మంచి మార్క్ సంపాధించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు.