- మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని ఆదివారం ఓ ప్రకటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. దేశం అంటే బీహార్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని మరో 26 రాష్ట్రాల్లో ప్రజలు ఉన్నారని గుర్తించాలన్నారు.
తెలంగాణపై మొదటి నుంచి కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఫెడరల్ స్ఫూర్తిగా పరిపాలన చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నప్పటికీ ఆచరణలో అది కన్పించట్లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని, కనీసం మెట్రో రైలు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోడం దురదృష్టకరమని పేర్కొన్నారు.