బోధన్, వెలుగు: బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఐ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. డివిజన్ కార్యదర్శి బి.మల్లేశ్ మాట్లడుతూ కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన పంటలకు ఎంఎస్ పీ (మినిమం సపోర్ట్ ప్రైజ్) చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రైతుల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. లీడర్లు పడాల శంకర్, జీ.సీతారాం, ఖాజామియా, శంకర్, బాలు, మొనాజీ పాల్గొన్నారు.