ఢిల్లీలోని ప్రైవేట్ హస్పిటల్స్ లో అధిక చార్జీల నియంత్రణపై గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీకి నీతి ఆయోగ్ సీనియర్ అధికారి ముఖ్య పర్యవేక్షకుడిగా ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చార్జీల నియంత్రణకు ఆ కమిటీ కొన్ని సూచనలు జారీ చేసింది. వాటికి అనుగుణంగానే ఇక నుంచి ఢిల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజులు వసూల్ చేయాలి. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్.. ఐసోలేషన్ బెడ్ రోజుకి రూ. 24,000-25,000 రూపాయలు, ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా రూ. 34,000-43,000, ఐసీయూలో వెంటిలేటర్ తో కలిపి రూ. 44,000-54,000 చార్జీలు వసూల్ చేస్తున్నాయి. ఆ చార్జీలను మారుస్తూ కమిటీ కొత్త చార్జీలను సిఫారసు చేసింది. ఐసోలేషన్ బెడ్ రోజుకి 8,000-10,000, ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా రూ. 13,000-15,000, ఐసీయూలో వెంటిలేటర్ మరియు పీపీఈ కిట్లతో సహా కలిపి రూ. 15,000 – 18,000 వసూలు చేయాలని కమిటీ సూచించింది. ఈ చార్జీలు నేటి నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా సోకిన వారికి కూడా ఈ చార్జీలనే అమలుచేయాలని కమిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆదేశించింది.
For More News..