తిరుపతి లడ్డూ కల్తీ లొల్లి: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

తిరుపతి లడ్డూ కల్తీ లొల్లి: రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‎తో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారింది. స్వయంగా స్టేట్ సీఎం చంద్రబాబే తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని చేసిన కామెంట్స్ నేషనల్ వైడ్‎గా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూ జాతీయ స్థాయిలో హెడ్ లైన్స్‎లో నిలవడంతో పాటు పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో  కేంద్రంలో మోడీ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన కంపెనీల్లో ఒకటైన ఏఆర్ డెయిరీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది.

 తమిళనాడుకు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ ఏఆర్ డెయిరీకి కేంద్ర సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు పంపింది. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏఆర్ డెయిరీ తిరుపతి లడ్డూ ప్రసాదానికి నెయ్యి సరఫరా చేసింది. అయితే, ఏఆర్ డెయిర్ నెయ్యిలో కల్తీ జరిగిందని.. ఇందులో జంతు నూనె, పంది కొవ్వు వంటి పదార్థాలు కలిశాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య లడ్డూ లొల్లి స్టార్ అయ్యింది. 

ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. చంద్రబాబువి ఆధారాలు లేని ఆరోపణలు : మాజీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్రం రంగంలోకి దిగింది. మరోవైపు, తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి పంపిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఏఆర్ డెయిరీ ఆరోపిస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు గాను ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను టీటీడీ బోర్డు ఇప్పటికే బ్లాక్‌లిస్ట్‎లో పెట్టింది. మొత్తానికి  దేశవ్యా్ప్తంగా సంచలనం రేపుతోన్న తిరుపతి లడ్డూ కల్తీ ఎపిసోడ్ లోకి తాజాగా కేంద్రం ఎంటర్ కావడంతో ఈ ఇష్యూ ఏ మలుపు తిరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.