లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లారీలు నడిచేందుకు గ్రీన్‌‌సిగ్నల్
ట్రక్కులు,గూడ్స్ కారియర్లకు కేంద్రం అనుమతి
ఆపొద్దని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశం
అదనపు పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల్లో తిరగొచ్చు
డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తికి మాత్రమే పర్మిషన్‌‌..
ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు
నిన్నటి దాకా అత్యవసర వాహనాలకే అనుమతి

నిత్యావసర వస్తువుల కొరత తలెత్తకుండా సరుకు రవాణా వాహనాలు తిరిగేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏ రాష్ట్రం కూడా గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్స్ తిరగకుండా ఆంక్షలు విధించొద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక గైడ్‌‌లైన్స్ రూపొందించింది. ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన లారీలు, ట్రక్కులు తదితర వెహికల్స్‌ కేంద్రం ఆదేశాలతో రోడ్డెక్కుతున్నాయి.

అన్ని రకాల గూడ్స్ బండ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎక్కడా గూడ్స్ వెహికల్స్ను ఆపొద్దని రాష్ర్టాలను ఆదేశించింది. రాష్ర్టంలో, ఇతర రాష్ర్టాల్లో తిరిగే వాటికి ఆంక్షలు విధించొద్దంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించింది. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించింది. వాహనంలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తే ఉండాలని సూచించింది. ప్రయాణికులను ఎక్కించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సోమవారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు లెటర్‌రాశారు. గైడ్లైన్స్ అమలు చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ ఆగిపోయిన వెహికల్స్.. కేంద్రం ఆదేశాలతో రోడ్డెక్కుతున్నాయి. వివిధ పరిశ్రమల నుంచి లారీలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. ఇక హైవేలపై లారీలు పరుగులు పెట్టనున్నాయి.

లారీలకు మస్తుగిరాకీ..
లాక్‌డౌన్‌ వల్ల20 రోజులుగా వాహనాలు ఆగిపోయాయి. లాక్‌ డౌన్ పీరియడ్లో అత్యవసర వస్తువుల రవాణాకే కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో చాలామంది డ్రైవర్లు గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనాలను మార్గమధ్యలోనే రోడ్డుపక్కన పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసి వెళ్లిపోయారు. నిలిచిపోయిన ట్రక్కుల్లో కార్లు, బైక్స్, ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్స్, పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకులు ఉండిపోయాయి. సరుకు అన్‌లోడ్ చేసేందుకు కూలీలు కూడా లేరు. ఇప్పుడు గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రవాణాకు అనుమతులు రావడంతో లారీ, ట్రక్కుల యజమానులకు ఊరట కలిగింది. మస్తు గిరాకీ లభిస్తోంది.

లేబర్‌‌కావాలె..
ప్రస్తుంతం లేబర్ కొరత ఉందని, ఇబ్బందులు తలెత్తొచ్చని లారీల యజమానులు పేర్కొంటున్నారు. కార్మికులు వస్తేనే గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాహనాలకు మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌ బాగా ఉంటుందని చెబుతున్నారు.

కేంద్రం గైడ్‌‌లైన్స్‌
అన్ని గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనాలకు పర్మిషన్‌ ఇవ్వాలి. పాస్‌లతో నిమిత్తం లేకుండా స్థానిక, ఇతర రాష్ర్టాల ట్రక్కుల రాకపోకలకు అనుమతి ఇవ్వాలి.
డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటుమరో వ్యక్తికే పర్మిషన్‌. ప్రయాణికుల తరలింపుకు అనుమతి లేదు.
డ్రైవర్లు , క్లీనర్లు తమ పని ప్రాంతాలకు చేరుకునేలా స్థానిక ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇంటినుంచి ట్రక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వెళ్తున్న డ్రైవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లీనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపవద్దు.
వర్కర్లు, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌కు రావడానికి, పోవడానికి సహకరించాలి.
ఖాళీగా వెళ్తున్న ట్రక్కులు, గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపవద్దు.
లాక్డౌన్ ఆంక్షలనుంచి సడలింపు ఉన్న కంపెనీలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే పాస్‌లు అందించాలి.
చిన్నతరహా పరిశ్రమల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించాలి.
వాహనాల మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ట్రక్కులను గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుమతించాలి. ఈ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటైన్ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలు, క్వారంటైన్‌, హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయని పేర్కొంది.

For More News..

లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ