క్రెడిట్ గ్యారంటీ స్కీం ఫర్ స్టార్టప్స్

క్రెడిట్ గ్యారంటీ స్కీం ఫర్ స్టార్టప్స్

వెలుగు బిజినెస్​ డెస్క్​:  స్టార్టప్​ల కోసం కొత్తగా క్రెడిట్​ గ్యారంటీ స్కీమ్​ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రెడిట్​ గ్యారంటీ స్కీమ్​ ఫర్​ స్టార్టప్స్​ (సీజీఎస్​ఎస్​) పేరుతో ఈ స్కీమును తెచ్చారు. కోలేటరల్​ సెక్యూరిటీ అవసరం లేకుండా స్టార్టప్​లకు అప్పులు దొరికేలా చూసే ఉద్దేశంతో ఈ స్కీమును తెస్తున్నారు. డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ ) ఈ స్కీమును నోటిఫై చేసింది. అక్టోబర్​ 6 లేదా ఆ తర్వాత బారోవర్లకు శాంక్షనయ్యే అప్పులకు ఈ స్కీము వర్తిస్తుందని డీపీఐఐటీ వెల్లడించింది.

లిక్విడిటీ ఇబ్బందులు తొలగించేందుకు..

స్టార్టప్​లుగా గుర్తించిన వాటికి మెంబర్​ ఇన్​స్టిట్యూషన్లు రుణాల రూపంలో  ఫైనాన్స్​ అందించేలా క్రెడిట్​ గ్యారంటీ స్కీమ్​ ఫర్​ స్టార్టప్స్​ను ప్రభుత్వం ఆమోదించినట్లు డీపీఐఐటీ పేర్కొంది. డబ్బు దొరక్క సతమతమయ్యే స్టార్టప్​లకు కోలేటరల్​ సెక్యూరిటీ లేకుండానే అప్పులు ఈజీగా దొరికేలా ఈ స్కీము పనిచేస్తుందని వివరించింది. స్టార్టప్​లకు అప్పులిచ్చే  మెంబర్​ ఇన్​స్టిట్యూషన్లకు క్రెడిట్​ గ్యారంటీని ప్రభుత్వం ఇస్తుంది. అర్హత ఉన్న స్టార్టప్​లను డీపీఐఐటీ గెజిట్​ నోటిఫికేషన్​ ద్వారా డిఫైన్​ చేస్తుంది. ఇండివిడ్యువల్ స్టార్టప్​లకు రూ. 10 కోట్ల దాకా (మాగ్జిమమ్​) అప్పులు తీసుకునే వీలు దీంతో కలగనుంది. రెండు రకాలుగా ఈ సీజీఎస్​ఎస్​ స్కీమును అమలు చేయనున్నారు. ట్రాన్సాక్షన్​ బేస్డ్, అంబ్రెల్లా బేస్డ్​ పద్ధతులలో స్టార్టప్​లకు సాయం చేయనున్నారు.  ట్రాన్సాక్షన్​ బేస్డ్​ గ్యారంటీ కవర్​ ద్వారా బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు స్టార్టప్​లకు నిధులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటారు. రూ. 3 కోట్ల దాకా  అప్పులు తీసుకున్న స్టార్టప్ ​తిరిగి చెల్లించడంలో ఫెయిలైతే అందులో 80 శాతం మొత్తాన్ని సీజీఎస్​ఎస్​ స్కీము కింద చెల్లిస్తారు. ఒక వేళ అప్పు రూ. 3 కోట్లకు మించి రూ. 5 కోట్ల లోపు ఉన్నట్లయితే అందులో 75 శాతానికి స్కీమును వర్తింప చేస్తారు. అప్పు మొత్తం రూ. 10 కోట్లకు మించితే అందులో 65 శాతాన్ని సీజీఎస్​ఎస్​ స్కీమ్​ కింద ప్రభుత్వం బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలకు తిరిగి చెల్లించనున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది.

అంబ్రెల్లా బేస్డ్​ గ్యారంటీ కవర్​...

ఆల్టర్నేటివ్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్స్​ (ఏఐఎఫ్​)గా సెబీ గుర్తింపు పొందిన వెంచర్​ డెట్​ ఫండ్స్​ (వీడీఎఫ్​)లకు దీని కింద గ్యారంటీ కవర్​ కల్పిస్తారు. వాస్తవ నష్టాలు ఎంతుంటే అంత లేదా పూల్డ్​ ఇన్వెస్ట్​మెంట్​లో 5 శాతం దాకా ఈ అంబ్రెల్లా కవర్​ అందుబాటులో ఉంటుంది. ఒక్కో బారావర్​పై రూ. 10 కోట్ల పరిమితి ఉంటుంది. కొత్త స్కీము అమలు కోసం డీపీఐఐటీ ఒక మేనేజ్​మంట్​ కమిటీని ఏర్పాటు చేయనుంది. నేషనల్​ క్రెడిట్​ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్​ (ఎన్​సీజీటీసీ) ఈ స్కీమును ఆపరేట్​ చేస్తుంది. దేశంలోని స్టార్టప్​లకు దేశీయంగానే నిధులు దొరికేలా చేయాలనేదే స్కీము టార్గెట్​. స్టార్టప్​ ఇండియా ఇనీషియేటివ్​ కింద అమలవుతున్న ఫండ్​ ఆఫ్​ ఫండ్స్​ఫర్​ స్టార్టప్స్​, స్టార్టప్​ ఇండియా సీడ్​ ఫండ్​ స్కీములకు  ఈ కొత్త స్కీము తోడవుతుందని మినిస్ట్రీ పేర్కొంది.