న్యూఢిల్లీ: పిల్లలకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు కేంద్రం బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎన్‌పీఎస్ వాత్సల్య అనే స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని కింద చిన్నారుల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు, గార్డియన్లు ఇందులో డబ్బులను జమ చేసుకోవచ్చు. పిల్లలకు18 ఏండ్ల వయస్సు వచ్చాక ఈ పథకాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) పాలసీగా మార్చుకోవచ్చు.
పోస్టాఫీసు లేదా జాతీయ బ్యాంకులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) కింద వాత్సల్య ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ప్రతి నెలా లేదా నిర్దిష్ట వ్యవధిలో ఈ ఖాతాలో డబ్బులను పొదుపు చేసుకోవచ్చు.