గార్మెంట్స్ రంగానికి పీఎల్​ఐ పథకం

గార్మెంట్స్ రంగానికి పీఎల్​ఐ పథకం
  • పరిశీలిస్తున్నామన్న కేంద్రం 

న్యూఢిల్లీ: టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్ పరిశ్రమల కోసం కోసం రూ. 10 వేల కోట్లకు పైగా ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్​ఐ) పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇప్పుడు దీనిని గార్మెంట్స్​కూ విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం తెలిపారు. దేశీయ తయారీ  ఎగుమతులను పెంపొందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్​ను ఉద్దేశించి సింగ్ మాట్లాడుతూ, ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయని, రాబోయే సంవత్సరాల్లో పరిశ్రమ  50 బిలియన్ల డాలర్ల విలువైన సరుకులను లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.    భారతీయ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం దాదాపు 165 బిలియన్ డాలర్లు అని,  దానిని 350 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.  ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు తమ మంత్రిత్వ శాఖ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తోందని సింగ్​చెప్పారు.