బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకం రద్దు 

బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకం రద్దు 

న్యూఢిల్లీ: బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి సుంకం నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించింది.  బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను ప్రభుత్వం తొలగించిన 15 రోజుల తరువాత ఈ నిర్ణయం వెలువడింది.   బ్రౌన్ రైస్ ,  ముతకబియ్యంపై కూడా ఎగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం తెలిపింది. బాస్మతియేతర తెల్ల బియ్యంపై ఎగుమతి సుంకం ఇప్పటివరకు 20 శాతంగా ఉంది.  

ఈ విధి మార్పులు సెప్టెంబర్ 27, 2024 నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ తెలిపింది.  ఔట్‌‌‌‌‌‌‌‌బౌండ్ షిప్​మెంట్స్​ను, రైతుల ఆదాయాన్ని పెంచడానికి బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం రద్దు చేసింది.