ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన అధినేత, బీజేపీతో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆయన బుధవారం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుకున్నారు. నిర్మలా సీతారామన్‌తో కలిసి ఏపీలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడారు. బుధవారం అక్కడే ఉన్న పవన్, గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసిన తర్వాత పవన్ మీడియాతో ముచ్చటించారు. ‘రాజధానుల వికేంద్రీకరణ హోమంత్రి అమిత్ షా అనుమతితోనే చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజధానుల వికేంద్రీకరణ అసలు బీజేపీ పెద్దల దృష్టికే రాలేదు. వైసీపీ వాళ్లు పూర్తి అబద్ధాలు చెబుతున్నారు. ఈ విషయం గురించి మేము నడ్డా గారితో కూడా మాట్లాడాం. మూడు రాజధానులు కేవలం వైసీపీ వాళ్ల భూదందాలకోసమే చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో ప్రధానమంత్రికి కాని, హోమంత్రికి కాని ఎటువంటి సంబంధం లేదు. జనసేన, బీజేపీ సంయుక్తంగా ఫిబ్రవరి 2న ఒక లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
ఈ భేటీలో పవన్‌తో పాటు పురందేశ్వరి, జీవీఎల్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
For More News..