హైదరాబాద్: తెలంగాణ కేడర్ కావాలని కోరిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ విజ్ఞప్తి చేసిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ కూడా కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో విధుల్లో ఉన్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్లు ఏపీలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు పంపింది. సదరు ఐఏఎస్, ఐపీఎస్ల పేరిట కేంద్రం లేఖలు రాసి.. ఆ లేఖల కాపీలను సీఎస్లకు పంపడం గమనార్హం. ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా విధుల్లో ఉండగా, రోనాల్డ్ రోస్ తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నోటీసులు అందుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు:
* ఆమ్రపాలి (ఐఏఎస్)
* రోనాల్డ్ రాస్ (ఐఏఎస్)
* ప్రశాంతి (ఐఏఎస్)
* వాకాటి కరుణ (ఐఏఎస్)
* వాణి ప్రసాద్ (ఐఏఎస్)
* అంజనీ కుమార్ (ఐపీఎస్)
* అభిలాష్ బిస్తూ (ఐపీఎస్)
* అభిషేక్ మహాంతి (ఐపీఎస్)