ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు :కేంద్రం

ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు :కేంద్రం
  •  హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చినా అమలుచేస్తం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టిం చిన ఫోన్ ట్యాపింగ్తో తమకు సంబంధం లేదని కేంద్ర సర్కారు వెల్లడించింది. గత ప్రభుత్వం దేప ట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం అందివ్వలేదని హైకోర్టుకు తెలిపింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లలో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదని పేర్కొన్నది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోక్ ఆరాడే, జస్టిస్ టి. వినోద్కు మార్తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. 

కేంద్రం తరపున అరనపు సాలిసి టర్ జనరల్ నరసింహశర్మకౌంటర్ దాఖలు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్కు తమ అనుమతి అవసరం లేదని తెలిపారు. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని, దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖ కార్య దర్శులు ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొన్నారు. 

కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం 2023 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చిందని, అయితే ఇంకా నిజం ధనలు రూపొందించలేదని, అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం అనుమతి లేకుండా ట్యాపిం గ్ కు పాల్పడితే 3 ఏండ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.1 కోట్ల జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా మంగళవారం ఉదయం అఫిడవిట్ దాఖలు చేయగా తదుపరి ని చారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. తీవ్రవాద కార్యకలాపాం డేటా బాస్: రాష్ట్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రవాద ర్యకలాపాలకు సంబంధించిన దశాబ్దాల సమాచా దాన్ని ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే చర్యల కు ఆస్కారం కల్పించారని ఆందోళన వ్యక్తం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసులో రాష్ట్ర హోం శాఖ తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా మంగళవారం హైకోర్టులో కౌంటరు పిటిషన్ దాఖలు చేశారు. 

గత బీఆర్ఎస్ సర్కారుకు అనుకూ లంగా వ్యవహరించేందుకు ప్రణీర్రావుతో సహా నిందితులు చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ క్కు పాల్ప ద్దారని తెలిపారు. నిందితులంతా వ్యక్తిగత అజెండాతో అధికార పార్టీకి సహకరించేందుకు అక్రమాలకు పా ల్పడ్డారని చెప్పారు. అలాగే, అనుమతి లేకుండా పరిక రాలను, రికారులను ద్వంసం చేశారని వివరించారు. 2019లో జారీ చేసిన జీవో 88 ప్రకారం ఇంటిలిజెన్స్ చీఫ్ సవీన్ చంద్, ఐజీపీ టి ప్రభాకర్రావు (ఎస్ఐబీ), బజీపీ రాజేశ్ కుమార్ (కౌంటర్ ఇంటెలిజెన్స్)కు ప్రభు. త్వం ఆధీకృత అధికారులుగా అనుమతి మంజూరు చేసిందన్నారు.

 2020 జూన్లో ప్రభాకర్రావు పదవీ విరమణ చేయగా ప్రభుత్వం రెండుసార్లు సర్వీసును పొడిగించిందని తెలిపారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం తదితరాల ముసుగులో మోసపూరితంగా అనుమ తులు పొంది, ట్యాపింగ్ క్కు పాల్పడినట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖతోపాటు ఇతర సంస్థల్లో కూడా తీ ప్రవాద సమాచారం నిమిత్తం ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ ఎస్ఐబీకీలక సంస్థ అని పేర్కొన్నారు.