దేశీయ ముడి చమురుపై పన్ను పెంపు

దేశీయ ముడి చమురుపై పన్ను పెంపు

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రభుత్వం మంగళవారం నుంచి విండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాల్ పన్నును టన్నుకు రూ.3,250 నుంచి రూ.6,000కు  పెంచింది. దీనిని    ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్​ఏఈడీ) రూపంలో విధిస్తారు.   డీజిల్, పెట్రోల్,  జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్​ ఎగుమతిపై ఎస్​ఏఈడీని వసూలు చేయబోమని,   కొత్త రేట్లు జూలై 2 నుంచి అమల్లోకి వస్తాయని అధికారిక నోటిఫికేషన్ తెలిపింది.  

భారతదేశం మొదటిసారిగా జూలై 1, 2022న విండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను విధించింది. ఇంధన కంపెనీల సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నార్మల్ లాభాలపై పన్ను విధించే అనేక దేశాలలో చేరింది.