- ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో యూపీఎస్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించడాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి వ్యతిరేకించారు. సీపీఎస్, యూపీఎస్ రెండు పెన్షన్ విధానాలు వద్దని, పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశం జరిగింది.
ఇందులో జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ, జేఏసీ విస్తరణ, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగాలచ్చిరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని అన్ని శాఖల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సంఘాల నాయకులతో ప్రత్యక్షంగా కలవనున్నట్టు తెలిపారు.
కాగా, పాత పెన్షన్ విధానామే అమలు చేయాలని కోరుతూ.. జేఏసీ ప్రతినిధులు శనివారం ప్రజా భవన్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం