పెట్రోల్​ ధరలతో కేంద్రం దోచుకుంటోంది

పెట్రోల్​ ధరలతో కేంద్రం దోచుకుంటోంది
  • కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: క్రూడాయిల్ ధరల తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ప్రజల నుంచి ఈ దోపిడీ చేస్తుందని  ప్రశ్నించారు. 

ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. “క్రూడాయిల్ ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గట్లేదు. మోదీ ప్రభుత్వం ప్రజలను నిర్భయంగా దోచుకుంటోంది. మే 2014 నుంచి క్రూడాయిల్ ధరలు సుమారు 34 శాతం తగ్గాయి. ధరలను తగ్గించకుండా పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.36 లక్షల కోట్ల పన్ను వసూళ్లకు పాల్పడింది” అని మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు.