
- ఎస్‌ఎస్‌బీలో హెడ్‌కానిస్టేబుల్స్
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఖాళీలు: 115
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఇంటర్/ 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేయాలి.
వయస్సు: అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 4 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.25,500 బేసిక్ వేతనం ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టులో పురుష అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకండ్లలో చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: 24 జులై
చివరి తేదీ: ఆగస్టు 22, 2021
వెబ్‌సైట్: www.ssbrectt.gov.in