
నిరుద్యోగుల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పలు కంపెనీల్లో శిక్షణతో పాటు జాబ్ అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తుది గడువును మార్చి నెలాఖరు వరకూ పొడిగించింది.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం మొబైల్ అప్లికేషన్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ( March 17) ప్రారంభించారు . నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేందుకు ఈ యాప్‌లో కంపెనీలను చేరాలని ఆమె కోరారు. ఈ పథకంలో యువత చేరేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
యువతకు జీవనోపాధి కల్పించే లక్ష్యంగా 2024–25 లో 1.25 లక్షలల మందికి అవకాశాలను కల్పించాలని ప్రధానమంత్రి ఇంటర్నషిప్ పథకాన్ని గతేడాది అక్టోబర్ 3 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. టైర్ II.. టూర్ III నగరాలకు చెందిన యూత్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్న్‌షిప్ పథకం మొబైల్ ప్రారంభించిన మంత్రి నిర్మలా సీతారామన్ ..
పరిశ్రమల్లో పనిచేసేందుకు యువతకు శిక్షణతో జాబ్ ఇవ్వాలన్నారు. కంపెనీల్లో పనిచేసేందుకు సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈపథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం లో ఇప్పటికే 500 పైచిలుకు కంపెనీలు ఉన్నాయని.. ఇంకా మరికొన్ని పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని ఆమె అన్నారు.
ALSO READ | మీడియా అంటే భయపడే మోదీ.. పాడ్కాస్ట్లో నీతులు చెప్పడం విడ్డూరం: కాంగ్రెస్
కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడుతూ .. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ఏంటో విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి. వాటిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ అమూల్య అవకాశాన్ని దేశ యువతకు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని మంత్రి ఇంటర్నెన్ షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కంపెనీల్లో ఇంటర్న్‌లుగా చేరి అమూల్యమైన పని అనుభవాన్ని గడించే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుందన్నారు.
ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ లో మొదటి రౌండ్‌లో 1.27 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలను కంపెనీలు అందించాయన్నారు. రెండవ రౌండ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది ( 2025) జనవరిలో ప్రారంభమైందని.. ఇప్పటికే దాదాపు 327 కంపెనీలు.. 1.18 లక్షలకు పైగా ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రెండవ రౌండ్‌లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని డెడ్‌లైన్ మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పథకం ద్వారా ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే అభ్యర్థులు https://pminternship.mca.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.