సిరికొండ, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు ప్రజలంతా ఏకం కావాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి పిలుపునిచ్చారు. మండలంలోని తాల్ల రామడుగులో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
భిక్షపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారంటీలతో పాటు, రైతులకు రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయాలని, వరికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, కార్యదర్శి గంగాధర్, లీడర్లు సంతోష్, పోతిరెడ్డి, భాస్కర్, సురేశ్ పాల్గొన్నారు.