- సెకండ్‌టైమ్ లోన్లు తీసుకోవడంలో స్టేట్‌లో కామారెడ్డి జిల్లా టాప్
- రెండోసారి జిల్లాలో 4,964 మందికి లోన్లు
కామారెడ్డి, వెలుగు : కరోనా చాలామంది ఉపాధిపై ప్రభావం చూపింది. ముఖ్యంగా స్ర్టీట్వెండర్స్అనేక ఇబ్బందులు పడ్డారు. ఏ రోజుకారోజు వచ్చే ఆదాయంతో జీవనం సాగించే వారికి కుటుంబాలను పోషించడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి భరోసా కల్పించింది. లోన్ తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి రెట్టింపు లోన్ ఇస్తూ వారి బిజినెస్ పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
సెకండ్టైం లోన్లు తీసుకోవడంలో కామారెడ్డి జిల్లా స్టేట్‌లోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 9,268 మంది స్ర్టీట్వెండర్స్ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. వీళ్లు రోడ్ల పక్కన కూరగాయలు, పండ్లు, పూలు, తినుబండారాలు, ఆటబొమ్మలు, బట్టలు, ఇతర వస్తువులు అమ్ముతుంటారు. కరోనా టైంలో వీళ్లు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించి తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ ద్వారా లోన్లు మంజూరు చేసింది.
ఈ వ్యవహారాలన్ని మెప్మా పర్యవేక్షించింది. ఫస్ట్ టైం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇచ్చారు. ఈ లోన్ 10 నెలల్లో తిరిగి చెల్లించాలి. సంవత్సరానికి 7 శాతం మిత్తి ఉంటుంది. సకాలంలో చెల్లించిన వారికి సెకండ్ టైమ్ రూ.20 వేలు, ఆ తర్వాత రూ.50 వేల లోన్ఇస్తున్నారు. మున్సిపాలిటీల వారీగా స్ర్టీట్వెండర్స్ను గుర్తించి, వారికి లోన్లపై మెప్మా ఆధ్వర్యంలో అవేర్నెస్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైమ్ లోన్ తీసుకొని, సకాలంలో చెల్లించిన వారికి సెకండ్‌టైమ్ తీసుకోడానికి అర్హత వచ్చింది. సెకండ్ టైమ్ లోన్లు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా స్టేట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. థర్డ్‌టైమ్ లోన్‌కి కూడా 60 మంది అర్హత సాధించారు.
మున్సిపాలిటీల వారిగా..
ఫస్ట్ టైమ్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో 7,585 మందికి రూ.7.55 కోట్ల లోన్ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 5,035 మంది, బాన్సువాడలో 1,492 మంది, ఎల్లారెడ్డిలో 1,057 మంది లబ్ధిపొందారు. సెకండ్‌టైమ్ జిల్లాలో 4,964 మందికి రూ.9.92 కోట్ల లోన్లు ఇచ్చారు. ఇందులో కామారెడ్డి నుంచి 3,199 మంది, బాన్సువాడ 1,087 మంది, ఎల్లారెడ్డిలో 678 లబ్ధి పొందారు.
డిజిటల్ లావాదేవీలు చేస్తే ఇన్సెంటీవ్..
లోన్ తీసుకున్న స్ర్టీట్వెండర్స్ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు చేస్తే ఇన్సెంటీవ్ఇస్తున్నారు. నెలలో 100 డిజిటల్ లావాదేవీలకు రూ.50 ఇస్తున్నారు. స్ర్టీట్వెండర్స్ వస్తువులు అమ్మినప్పుడు కొనుగోలుదారుల దగ్గర నగదు రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో పైసలు తీసుకోవాలి. దీనిపై స్ట్రీట్వెండర్స్కు మెప్మా ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు.
ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు గోవర్ధన్. కామారెడ్డిలో రోడ్డు పక్కన బట్టలు అమ్ముతుంటాడు. కరోనా తర్వాత ఇతడికి బ్యాంక్ ద్వారా ఆఫీసర్లు రూ.10 వేల లోన్ ఇచ్చారు. సకాలంలో చెల్లించడంతో మళ్లీ రూ.20 వేలు ఇచ్చారు. వీటిని కూడా క్రమంతప్పక చెల్లించడంతో ఇప్పుడు రూ.50 వేల లోన్‌కు అర్హత వచ్చింది. బ్యాంక్‌లోన్ బిజినెస్ పెట్టుబడికి ఎంతో ఉపయోగపడిందని గోవర్ధన్చెబుతున్నారు.
సపోర్ట్ దొరికింది
స్ర్టీట్వెండర్స్కు లోన్ఇవ్వడంతో వారికి ఆర్థికంగా సపోర్ట్ లభించింది. ఫస్ట్ టైమ్తీసుకున్న లోన్ అమౌంట్ రెగ్యులర్‌గా చెల్లించిన వారికి సెకండ్ టైమ్ డబుల్ అమౌంట్ ఇస్తున్నారు. తక్కువ వడ్డీతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోన్దొరుకుతోంది. ఎక్కువ మంది సకాలంలో లోన్చెల్లించి, మళ్లీ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
శ్రీధర్‌రెడ్డి, మెప్మా పీడీ, కామారెడ్డి జిల్లా