భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్

యాదాద్రిభువనగిరి:భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది.  ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృందాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 22న భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకులానికి NCSC బృందం సభ్యులు వెళ్లనున్నారు. ఫుడ్ పాయిజన్ పై కేంద్రానికి  NCSC బృందం నివేదిక ఇవ్వనుంది. 

ఈ నెల 12 న భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఫుడ్‌‌‌‌‌‌‌‌ పాయిజన్‌‌‌‌‌‌‌‌ ఘటనలో 9 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న స్టూడెంట్లు రాత్రి భోజనంలో మజ్జిగతో పాటు కిచిడీ తిన్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఏప్రిల్ 16న ప్రశాంత్ అనే 6వ తరగతి విద్యార్థి మృతిచెందాడు. ప్రస్తుతం మిగిలిన విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. ఆరో తరగతి చదువుతున్న  మరో విద్యార్థి కృష్ణ పరిస్థితి సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉండడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృందం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.