రూల్స్ తెచ్చేందుకు ఓ కమిటీ ఏర్పాటు
వచ్చే వారం కమిటీ మూడో మీటింగ్
న్యూఢిల్లీ: ఐటీ, ఐటీ ఎనబుల్డ్ సర్వీసెస్ ఇండస్ట్రీ (ఐటీఈఎస్)లలో వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వం ఓకమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐటీ ఇండస్ట్రీలకు చెందిన ఐదు కంపెనీలుంటాయి. వీటితో పాటు నాస్కామ్ ప్రతినిధులు, టెలికాం డిపార్ట్ మెంట్ నుంచి నలుగురు ప్రతినిధులు ఉంటారు. వర్క్ ఫ్రమ్‌హోమ్ మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ రూల్స్‌ను తయారు చేయనుంది. ఇప్పటికే ఈ కమిటీ రెండు సార్లు సమావేశమయింది. వచ్చేవారం మరోసారి సమావేశం కావాలని చూస్తోంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ, టెలికాం, లేబర్, కామర్స్ మినిస్ట్రీలతో కూడిన ఓ మినిస్ట్రీయల్ గ్రూప్ కింద ఈ కమిటీ పనిచేస్తోంది. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ఇస్తున్న తాత్కాలిక మినహాయింపులను శాశ్వతంగా మార్చేందుకు ఈ కమిటీ పనిచేయనుంది.
మెజారిటీ ఎంప్లాయిస్‌కు వర్క్ ఫ్రం హోమే!
లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి దేశంలో 85 శాతం ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ మాత్రమే కాకుండా, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్‌కు అవసరమైన రూల్స్‌ను తీసుకొచ్చేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. లొకేషన్ రిపోర్ట్ ఇబ్బందులను, క్లౌడ్‌ను వాడేటప్పుడు సెక్యూర్డ్ కనెక్టివిటీ వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది.
For More News..