
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అధికార చిహ్నా న్ని మార్చడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసు కోవాల్సి ఉంటుందని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నాయకుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమా ర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసు కుంటే, కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో తాను ఏడాది పాటు తిరిగితేనే, తమకు అనుమతి దొరికిందని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను హైకోర్టులో కేసు వేస్తానని హెచ్చరించడంతోనే, చిహ్నం మార్పుపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని ఆయన పేర్కొన్నారు.