ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబిటెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ ఉపసంఘం ఇటీవలే సిఫారసు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. శుక్రవారం (17 జనవరి) సాయంత్రం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ప్రెస్ మీట్ లో ప్రకటించారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దనీ చాలా రోజులుగా ఏపీ లో ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు ఈ ఆందోళనలకు మద్ధతు ఇచ్చాయి. స్వయంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే పోరాటానికి మద్ధతునిచ్చారు. అదేవిధంగా టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు కూడా ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశాయి.
ALSO READ | శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్..
టీడీపీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంలో ఉండటంతో పలుమార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామిని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. అందులో భాగంగా తాజాగా ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.