- 64 గ్రామాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
- తొలి దశలో ఖమ్మంలో 10, భద్రాద్రి జిల్లాలో 20 గ్రామాలు ఎంపిక
భద్రాచలం, వెలుగు: మన్యంలో ఆదివాసీ పల్లెల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆది ఆవాస్ గ్రామ యోజన(పీఎంఏఏజీవై) కింద భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 64 గిరిజన గ్రామాలను ఎంపిక చేసింది. ఈ పథకం కింద ఎంపిక చేయబడ్డ ఒక్కో గ్రామానికి రూ.20లక్షలు ఇవ్వాలని మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సిఫార్సు చేసింది. తొలి దశలో ఖమ్మం జిల్లాలో 10, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 20 గిరిపల్లెలను ఎంపిక చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో పనులు ప్రారంభం కాగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 20 గ్రామాల్లో పనులు షురూ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
ఎంపిక చేసిన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కేంద్రం ప్రధాన మంత్రి ఆది ఆవాస్ గ్రామ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత,శానిటేషన్, మంచినీరు, అంగన్వాడీ కేంద్రాలకు సదుపాయాలు, కరెంట్ సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వినియోగిస్తారు. సీసీ రోడ్లు, డ్రైన్లు ఇలా గ్రామానికి అవసరమైన పనులను ఈ నిధులతో చేపట్టవచ్చు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గొందిగూడెం(అశ్వాపురం), తుంగాల (చండ్రుగొండ), కుర్నపల్లి(చర్ల), అంకంపాలెం, జగ్గారం, పట్వారిగూడెం, పెద్దగొల్లగూడెం, నాగుపల్లి(దమ్మపేట), పైడిగూడెం, చిన్ననల్లబెల్లి, ఆర్లగూడెం, నడిపూడి, లచ్చిగూడెం, మారాయిగూడెం(దుమ్ముగూడెం), పాపకొల్లు(జూలూరుపాడు), కారుకొండ(లక్ష్మీదేవిపల్లి), బోడు, కొప్పురాయిగూడెం(టేకులపల్లి), కొమరారం, రాగబోయినగూడెం(ఇల్లెందు), ఖమ్మం జిల్లాలో గోవిందాపురం, పొన్నేకల్(కామేపల్లి), ఉసిరికాయలపల్లి, కోమట్లగూడెం, మాణిక్యారం, గేటుకారేపల్లి, మాదారం,పేరుపల్లి(సింగరేణి), నాచారం, బురదరాఘవాపురం(ఏన్కూర్) గ్రామాలు తొలి దశలో ఎంపికయ్యాయి.
ప్రాధాన్యతా క్రమంలో పనులు
ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమంలో పనులు నిర్వహిస్తాం. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులే ఈ పథకం లక్ష్యం. తొలివిడత గ్రామాల్లో పనులు పూర్తి కాగానే రెండో విడతలో ఎంపికైన విలేజ్లలో పనులకు యాక్షన్ ప్లాన్ సంబంధిత ఆఫీసర్లు తయారు చేస్తారు. మారుమూల గ్రామాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది.
–గౌతమ్ పోట్రు,ఐటీడీఏ పీవో
స్వర్ణ కవచధారిగా రామయ్య
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం స్వర్ణ కవచలాతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ అనంతరం స్వామికి బాలబోగం నివేదించి బంగారు కవచాలను అలంకరించారు. అంతకుముందు లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. కుంకుమార్చన చేశారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్యకల్యాణం జరిపించారు. మాధ్యాహ్నిక ఆరాధనలఅనంతరం రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం అద్దాల మండపంలో రామయ్యకు సంధ్యాహారతి ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మండావి రామయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాద్రి రామయ్య ఆలయ డెవలప్మెంట్ను పట్టించుకోవడం లేదన్నారు.
నాణ్యమైన పామాయిల్ మొక్కలు సప్లై చేయాలి
సత్తుపల్లి, వెలుగు: రైతులకు నాణ్యమైన పామాయిల్ మొక్కలు సప్లై చేయాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల అధికారి అనసూయ సూచించారు. శుక్రవారం మండలంలోని రేగళ్లపాడులో పామాయిల్ నర్సరీని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు ఒక మీటర్ ఎత్తు, 12 నుంచి 14 ఆకులు, 20 నుంచి 25 సెం.మీ చుట్టుకొలత, ఏడాది వయస్సు కలిగి ఉండేలా చూడాలన్నారు. మొక్కల పెంపకం, నాణ్యతపై పలు సూచనలు చేశారు. ఉద్యాన అధికారి జి.నగేశ్, ఆయిల్ ఫెడ్ మేనేజర్ బాలకృష్ణ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ సూచించారు. సిటీలోని జడ్పీ మీటింగ్ హాల్ లో శుక్రవారం 11 పీహెచ్ సీలకు మంజూరైన రూ.2,29,50,00 నిధులకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించారు. మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించుకొని మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఎంహెచ్ వో డాక్టర్ బి మాలతి, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
గుండాలపాడులో మలేరియా టీమ్ పర్యటన
ములకలపల్లి, వెలుగు: మండలంలోని గుండాలపాడు గ్రామంలో శుక్రవారం ఢిల్లీ సెంట్రల్ మలేరియా టెక్నీషియన్ టీమ్ పర్యటించింది. ఐదుగురు టెక్నీషియన్లతో కూడిన బృందం రాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరు, మలేరియా ట్రీట్మెంట్ కిట్లను పరిశీలించింది. ఇక్కడి ప్రజల నుంచి రక్తం శాంపిల్స్ తీసుకొని నాలుగు రకాల కిట్లతో టెస్ట్ చేసి వాటి పనితీరును పరిశీలించారు. జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ జేతురాం, హెల్త్ సూపర్వైజర్ శ్రీకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ హనుమంతరావు, ఏఎన్ఎం రమాదేవి పాల్గొన్నారు.
వంట గ్యాస్ ధర తగ్గించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి ఆధ్వర్యంలో శుక్రవారం సిటీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి టి.ఝాన్సీ, జె.భరత్, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ధరణి, చందు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆవుల మంగతాయి, లీడర్లు కవిత, సుజాత, శారద, జాస్మిన్, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పెంచాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మైనార్టీ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా డిమాండ్ చేశారు. జిల్లా సంక్షేమశాఖాధికారి సంజీవరావుకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సెలవుల కారణంగా చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారన్నారు. ఈ నెల 15 నుంచి నెల రోజుల గడువు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు హుస్సేన్ ఖాన్, జాకీర్ హుస్సేన్, షకీల్ పాల్గొన్నారు.
గుండాలపాడులో మలేరియా టీమ్ పర్యటన
ములకలపల్లి, వెలుగు: మండలంలోని గుండాలపాడు గ్రామంలో శుక్రవారం ఢిల్లీ సెంట్రల్ మలేరియా టెక్నీషియన్ టీమ్ పర్యటించింది. ఐదుగురు టెక్నీషియన్లతో కూడిన బృందం రాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరు, మలేరియా ట్రీట్మెంట్ కిట్లను పరిశీలించింది. ఇక్కడి ప్రజల నుంచి రక్తం శాంపిల్స్ తీసుకొని నాలుగు రకాల కిట్లతో టెస్ట్ చేసి వాటి పనితీరును పరిశీలించారు. జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ జేతురాం, హెల్త్ సూపర్వైజర్ శ్రీకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ హనుమంతరావు, ఏఎన్ఎం రమాదేవి పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రతీ స్టూడెంట్ ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు. బీసీ సంక్షేమశాఖాధికారి సురేందర్, మున్సిపల్ కమిషనర్ నవీన్ కుమార్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీటీసీ రుక్మిణి, ప్రిన్సిపాల్ క్రిష్ణవేణి పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
ఖమ్మం, వెలుగు: నగరంలోని ప్రసూన కార్డియాక్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె వైద్య శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 16 వరకు రోగులందరికీ ఉచితంగా పరీక్షలునిర్వహిస్తామని కార్డియాలజిస్ట్ డాక్టర్ జంజిరాల శశివర్ధన్, ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలభాస్కర్ రెడ్డి తెలిపారు. కార్డియాక్ స్క్రీనింగ్ ప్యాకేజీని రూ. 999లకు తగ్గించినట్లు చెప్పారు. బీపీ, షుగర్, క్రియాటినైన్, 2డి ఎకో, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
ఖమ్మం టౌన్,వెలుగు: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో భూసేకరణ, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హైవేలతో పాటు కొండపల్లి– - కాజీపేట 3వ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్కు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ, పరిహారం చెల్లింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఇరిగేషన్ సీఈ శంకర్ నాయక్, రైల్వే డిప్యూటీ సీఈ అమిత్ అగర్వాల్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, నేషనల్ హైవే పీడీ దుర్గాప్రసాద్, ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, సింగరేణి జీఎం జె. రమేశ్ పాల్గొన్నారు.
పెద్దవాగు ప్రాజెక్టు గేటు ఎత్తివేత
అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టు మూడో నెంబర్ గేటును 1.5 మీటర్లు పైకి ఎత్తి 4,028 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వడ్డెరంగాపురం, గుమ్మడవల్లి వద్ద వరద నీరు ఉధృతి ఎక్కువగా ఉండడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.
దొంగను పట్టిస్తే పారితోషికం
దమ్మపేట, వెలుగు: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టిస్తే పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. శుక్రవారం దొంగ ఫొటోను రిలీజ్ చేశారు. ఏటీఎం, బ్యాంకుల వద్ద మాయమాటలు చెప్పి డబ్బులతో ఉడాయిస్తాడని పేర్కొన్నారు. అశ్వారావుపేట సీఐ(9440795332), దమ్మపేట ఎస్సై (9440904268)లకు సమాచారం అందించాలని కోరారు.
‘మా బిడ్డను అప్పగించండి’
ఖమ్మం రూరల్, వెలుగు: ఏడాదిగా తమ బిడ్డ షేక్ సమీనా(19) కనిపించకుండా పోయిందని, పోలీస్ కేసు పెట్టినా ఆచూకీ దొరకలేదని తల్లిదండ్రులు షేక్ హుషేన్, షాహిన్, బాబాయ్ లాలూ సాహెబ్ వాపోయారు. శుక్రవారం తమ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తెను ఖమ్మం సిటీలోని మంచికంటినగర్కు చెందిన తాటి తేజ గత ఏడాది సెప్టెంబర్ 16న మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని చెప్పారు. వారం రోజుల నుంచి తమ కుమార్తె పేరుతో కోర్టు నోటీసులు పంపుతున్నారని తెలిపారు. తమ కూతురు చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే అభ్యంతరం లేదని, తమ కుటుంబం నుంచి వారికి ఎలాంటి హాని ఉండదని చెప్పారు. తమ కుమార్తెను చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
‘దివ్యాంగులను పట్టించుకుంటలేరు’
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దివ్యాంగుల పట్ల సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వికలాంగ జేఏసీ చైర్మన్ గుండపనేని సతీశ్ ఆరోపించారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ శుక్రవారం దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఏరియాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ లో దివ్యాంగులకు 5 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి శిక్షణ కోసం సింగరేణి పాత భవనాన్ని కేటాయించాలని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలన్నారు. సంఘం నాయకులు మేడి ప్రవీణ్, ఖాసీం, కళాబాబు, రమేశ్, సునీత, గోవింద్, భాస్కర్ పాల్గొన్నారు.
వై ప్రసాద్ హాస్పిటల్ ప్రారంభం
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన వై ప్రసాద్ హాస్పిటల్ ను శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగంలో అనుభవం కలిగిన ప్రముఖ సర్జన్ డాక్టర్ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, భాగం హేమంతరావు, భాగం కిషన్ రావు, ఎన్ రఘురాం, బేబీ స్వర్ణ కుమారి, ఏలూరి శ్రీనివాసరావు, డాక్టర్ వై.పద్మజ, డాక్టర్ వై.వెంకట్ ప్రశాంత్, డాక్టర్ వై.సింధూర పాల్గొన్నారు.
గంజాయి మొక్కలు ధ్వంసం
సత్తుపల్లి, వెలుగు: మండలంలోని బేతుపల్లి ఎస్టీ కాలనీలో గురువారం అర్ధరాత్రి గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు. గ్రామానికి చెందిన పాండ్ల రాములును బైండోవర్ చేసినట్లు చెప్పారు. గంజాయి మొక్కలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అటవీ సంరక్షణ చట్టాలు రద్దు చేయాలి
గుండాల, వెలుగు: కొత్త అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు, ప్రతిభ షిండే, అవునూరి మధు, ప్రసాద్పాల్గొన్నారు.