ప్రతి నెలా చివరికల్లా పెన్షన్ ఇవ్వండి .. బ్యాంకులకు కేంద్రం ఆదేశం

ప్రతి నెలా చివరికల్లా పెన్షన్ ఇవ్వండి .. బ్యాంకులకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఆలస్యంగా జమ చేస్తున్న  బ్యాంకులపై కేంద్ర ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. మంత్లీ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్‌‌‌‌ను కచ్చితంగా ప్రతి నెలా చివరి పని దినంలోపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో మాత్రం మొదటి పని రోజునే చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. పెన్షన్‌‌‌‌ డబ్బులు ఆలస్యంగా తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని పెన్షనర్లు ఇటీవల ఆందోళనకు దిగారు. ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదులు చేశారు. 

ఈ కంప్లైంట్లను ఆర్థిక శాఖ సీరియస్‌‌‌‌గా తీసుకుంది. పింఛన్ల పంపిణీలో జాప్యాన్ని సహించేది లేదని బ్యాంకులకు స్పష్టం చేసింది. గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో పేర్కొన్న టైమ్‌‌‌‌లైన్‌‌‌‌లను కచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది. పింఛను క్రెడిట్‌‌‌‌లో  జాప్యం జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రతి నెలా చివరి పనిదినం ఉదయం నాటికి.. పెన్షన్‌‌‌‌ల  క్రెడిట్‌‌‌‌ను నిర్ధారిస్తూ  బ్యాంకుల సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్‌‌‌‌(సీపీపీసీ)లు నివేదికను సమర్పించాలని కేంద్రం పేర్కొంది.