కేంద్రం గుడ్ న్యూస్: తెలంగాణకు రూ.3,637 కోట్లు

 

  •  పన్నుల్లో వాటా కింద నిధులు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం గుడ్​న్యూస్ చెప్పింది. పన్నుల్లో వాటా కింద తెలంగాణతో పాటు ఇతర స్టేట్లకు ఫండ్స్​రిలీజ్​చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు/యూటీలకు కలిపి జనవరి నెలకు మొత్తం  రూ.1,73,030 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ALSO READ | తెలంగాణ వాసులకు టామ్‌కామ్ గుడ్ న్యూస్.. జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలకు జాబ్ మేళా

ఇందులో తెలంగాణకు రూ.3,637 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,002 కోట్లు ఇచ్చింది. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమానికి నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. కాగా.. గత నెల(డిసెంబర్)లో రూ. 89,086 కోట్లను పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.