రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కేరళవాసి మృతి.. కేంద్రం సీరియస్

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దేశం తరుపున యుద్ధం చేస్తూ కేరళవాసి మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేరళలోని త్రిసూర్‌కు చెందిన బినిల్ బాబు (32) రష్యా సైన్యంలో చేరి సైనికుడిగా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్దంలో బినిల్ బాబుతోపాటూ ఆయన బంధువు డ్రోన్ బాంబ్ దాడిలో గాయపడ్డారు. అయితే బినిల్ బాబుకి తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ మరణించాడు.

ALSO READ | ఇక చాలు.. మా వాళ్లను త్వరగా తిరిగి పంపండి: రష్యాకు భారత్ డిమాండ్

ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా రష్యా తరుపున యుద్ధం చెయ్యడానికి నియమించిన కేరళవాసి దురదృష్టవశాత్తు మరణించినట్లు మాకు తెలిసింది. కేరళకు చెందిన మరో సైనికుడు కూడా మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిని భారత్ కి రప్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించాడు. ఇందులోభాగంగా ఇప్పటికే రష్యన్ అధికారులతో సంప్రదింపులు జరిపి మిగిలిన పౌరులని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.