నీట్ ఇక ఆన్​లైన్​లో

నీట్ ఇక ఆన్​లైన్​లో

నీట్ పరీక్షను ఇక నుంచి ఆన్​లైన్​లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో.. నీట్​ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నీట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, కోర్టుల్లో పిటిషన్లు, సీబీఐ ఎంక్వైరీ, పార్లమెంటు ఉభయసభల్లో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల రద్దు చేసిన నీట్ ​పీజీ, యూజీసీ నెట్​ తదితర పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) ప్రకటించింది.

న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్షను ఇక నుంచి ఆన్​లైన్​లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో.. నీట్​సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆన్​లైన్ విధానం ద్వారా పేపర్ లీకేజీలను అడ్డుకోవచ్చని సీనియర్​ ఆఫీసర్లు, విద్యావేత్తలు కూడా చెప్తున్నారు. 2017 నుంచి నీట్ పరీక్ష పెన్ అండ్ పేపర్​ పద్ధతిలో ఓఎంఆర్ షీట్​లో బబుల్స్ ఫిల్ చేసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్​(ఎంసీక్యూ) టెస్ట్ విధానంలో జరుగుతున్నది. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్​టీఏ) ద్వారా కేంద్ర వైద్య శాఖ నిర్వహిస్తున్నది. అయితే 2018లో అప్పటి విద్యాశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నీట్‌‌‌‌ను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నిర్వహిస్తామని, 2019 నుంచి ఏటా రెండుసార్లు పరీక్షలు జరుగుతాయిని ప్రకటించారు. 

అయితే తమను సంప్రదించకుండానే ఈ ప్రకటన చేయడమేంటని కేంద్ర వైద్య శాఖ వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. నీట్ పేపర్ లీకులతో దేశవ్యాప్తంగా నిరసనలు, కోర్టుల్లో పిటిషన్లు, సీబీఐ ఎక్వైరీ, పార్లమెంటు ఉభయసభలు వాయిదాపడడం వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఆన్​లైన్ మోడ్​లో పరీక్షల నిర్వహణపై గత వారం రోజల్లో హైలెవల్​లో మూడు సార్లు సమావేశమై చర్చించించినట్లు తెలిసింది. మరోవైపు ఐఐటీ, ఇంజినీరింగ్​ కాలేజీల ఎంట్రెన్స్​లు, జేఈఈ అడ్వాన్స్​డ్ తదితర పరీక్షలన్ని కూడా ఆన్​లైన్​లో జరుగుతున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులోనూ పేపర్​ లీకుల ముప్పు ఉన్న నేపథ్యంలో నీట్​ కూడా ఆన్​లైన్​లో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

పరీక్షలకు కొత్త తేదీల ప్రకటన

సీఎస్​ఐఆర్​ యూజీసీ– నెట్​కు సంబంధించి రద్దు చేసిన పరీక్షలకు ఎన్​టీఏ కొత్త తేదీలను ప్రకటించింది. సీఎస్​ఐఆర్ యూజీసీ–-నెట్ ను జులై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. యూజీసీ నెట్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్​ 8వ తేదీ వరకు జరుగుతుంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్​సీఈటీ) సెట్ ను జులై 10 నుంచి నిర్వహించనున్నారు.