- ఒమిక్రాన్‌ను ఎక్కడికక్కడే కట్టడి చేయాలె
- వార్‌రూమ్‌లు యాక్టివేట్ చేయండి
- రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ కొత్త వేరియంట్‌కు స్పీడెక్కువ కావడంతో దీనిని కట్టడి చేయడానికి అవసరమైతే ‘నైట్ కర్ఫ్యూ’ పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. వైరస్ కట్టడికి వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, ఫంక్షన్లు సహా వివిధ కార్యక్రమాలపై ఆంక్షలు పెట్టాలని పేర్కొంది. ఈమేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ రాశారు. డెల్టాతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మూడురెట్లు ఎక్కువ స్పీడ్‌తో వ్యాపిస్తోందని వివరించారు. కేసులు బయటపడ్డ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు, ఆంక్షలు పెట్టడం, ఫీల్డ్ లెవెల్లో ఎప్పటికప్పుడు పరిశీలన చేయడం ద్వారా మహమ్మారిని అడ్డుకోవచ్చన్నారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను, జాగ్రత్తలను సూచించారు.
ఇలా సిద్దం కావాలె..
- రాష్ట్రంలోకి వైరస్ ఎంటరైందని తెలిసీతెలియంగానే అలర్ట్ కావాలి. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా కట్టడి చర్యలు తీసుకోవాలి.
- ఆస్పత్రులలో ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న ఐసీయూ బెడ్లలో 40 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, పాజిటివిటీ రేటు 10 శాతం దాటినా అప్రమత్తం కావాలె.
- కంటెయిన్‌మెంట్‌జోన్లు ఏర్పాటు చేసి, వైరస్ వ్యాప్తిని కేసులు బయటపడ్డ చోటనే ఆపేయాలె.
- టెస్టులు, సర్వేలెన్స్ పెంచడం, హెల్త్ వర్కర్లతో ఇంటింటి సర్వే చేయించి కేసుల వివరాలు నమోదు చేసుకోవడం, కాంటాక్ట్ ట్రేసింగ్ పకడ్బందీగా చేయడం.
- ఒమిక్రాన్ బయటపడ్డ ఏరియాలో మిగతా పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలె.
- రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ కోసం చర్యలు తీసుకోవడం
- హాస్పిటల్ బెడ్స్, అంబులెన్స్‌లు, ఆక్సిజన్ ఎక్విప్మెంట్, మందులు తదితర ఎమర్జెన్సీ వైద్య సేవలను రెడీ చేసుకోవడం.