నక్సలిజానికి చివరి రోజులు : అమిత్ షా సంచలన ట్విట్

నక్సలిజానికి చివరి రోజులు : అమిత్ షా సంచలన ట్విట్

ఛత్తీస్ గఢ్, ఒడిషా బార్డర్లలో మంగళవారం (21 జనవరి) జరిగిన ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్ ఫ్రీ ఇండియాలో భాగంగా తమ జవాన్లు కీలక విజయం సాధించారని ఎక్స్ (ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.  ఒడిషా, ఛత్తీస్ గఢ్ బార్డర్ లో సీఆర్ పీఎఫ్ ( CRPF), ఎస్ఓజీ ఒడిషా (SoG Odisha), ఛత్తీస్ గఢ్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో 14 మంది నక్సల్స్ ను అంతం చేశారని పేర్కొన్నారు. 

నక్సల్ ఫ్రీ భారత్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో సెక్యూరిటీ బలగాలు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, నక్సలిజం ఇండియాలో తుది శ్వాస విడిచే పరిస్థితుల్లో ఉందని కామెంట్ చేశారు. 

భారత్ ను 2026 మార్చి వరకు నక్సల్ ఫ్రీ దేశంగా చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఒడిషా బార్డర్లలో వరుస కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. తాజాగా ఒడిషా బార్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కీలక నేతలతో సహా 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.