నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట భద్రత చేపట్టారు. ఈరోజు(డిసెంబర్ 2) రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. ప్రాజెక్టుపై నుంచి ఏపీ పోలీసులను సీఆర్పీఎఫ్ దళాలు పంపించే ప్రయత్నంలో ఉన్నారు. కృష్ణా జలాల వివాదంపై ఈరోజు ఢిల్లీలో జలశక్తి శాఖ సమావేశమవుతుందని అధికారులు తెలిపారు.
ఏం జరిగిందంటే..
ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్‌పీఎఫ్ సిబ్బందిపై దాడిచేశారు. తెలంగాణ పోలీసులు సాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొడక్షన్ కోర్స్ అధికారులు, నీటిపారుదల శాఖ తెలంగాణ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్ర ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ అధికారులపై ఐపీసీ సెక్షన్ 441, 448, 427 ల కింద కేసు నమోదు చేశారు.