ప్రణవ రియల్టీ ప్రాజెక్ట్​ ప్రారంభం

ప్రణవ రియల్టీ ప్రాజెక్ట్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రియల్టీ సంస్థ ప్రణవ గ్రూప్​ మరో భారీ ప్రాజెక్టును చేపట్టింది. గతంలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఎత్తైన భవనం కట్టిన ఈ సంస్థే మరో భారీ ప్రాజెక్ట్ ​ప్రణవ వన్ ​నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. క్లబ్ హౌస్​ను కూడా ప్రారంభించింది.

ఎకరం విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 95 సూపర్ లగ్జరీ నివాసాలు ఉంటాయని ప్రణవ గ్రూప్ చైర్మన్ రవి కుమార్ గుప్తా చెప్పారు. పర్యావరణ అనుకూలంగా ఈ ప్రాజెక్టును కడుతున్నామని, సుస్థిరతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా దీనిని డిజైన్ చేశామన్నారు. ప్రత్యేకంగా ప్రపంచ స్థాయి క్లబ్ హౌస్ ను రూపొందించామన్నారు. 

ఇది అమెరికా, యూరప్ దేశాల్లో మాదిరిగా అద్భుతమైన సౌకర్యాలతో ఉంటుందన్నారు.  అసాధారణ ఆర్కిటెక్చర్, విలాసవంతమైన సౌకర్యాలు, అత్యాధునిక ఫీచర్లు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు అని గుప్తా వివరించారు. ఇక్కడ నివాసం ఉండేవారు స్టెప్ గార్డెన్ ద్వారా తాజా పండ్లు, కూరగాయలను పెంచుకోవచ్చన్నారు.