విమానం హైజాక్ అనగానే..వెంటనే గుర్తొచ్చేది 1999లో జరిగిన కాందహార్ హైజాగ్ ఇన్సిడెంట్. దీని స్ఫూర్తితో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. ఇది జరిగి పాతికేళ్లు అవుతున్న ఈ పేరు వినిపిస్తూనే ఉంది.
ఇటీవలే డైరెక్టర్ అనుభవ్ సిన్హా ‘ఐసి 814: ది కాందహార్ హైజాక్’ (IC 814, Kandahar Hijack) పేరుతో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ గురువారం (ఆగస్ట్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఐదుగురు హైజాకర్లు, 188 జీవితాలు, 7 రోజుల భయానకం యథార్థ ఘటనలతో 6 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ స్ట్రీమింగ్కి వచ్చింది.
ఈ నేపథ్యంలో ‘IC 814: ది కాందహార్ హైజాక్’ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌పై రోజు రోజుకు వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో ఐదుగురు హైజాకర్ల పేర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంపై సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు హిందూ పేర్లయిన భోలా, శంకర్ అని పిలవడంపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ అని ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ వివాదాల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ చీఫ్ మోనికా షెర్గిల్‌ను మంగళవారం, సెప్టెంబర్ 3న, ఈ వివాదానికి దారితీసిన అంశాలపై వివరణ ఇవ్వమని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) ఆదేశాలు జారీ చేసింది.
సీరీస్‌లోని హైజాకర్లు చీఫ్, డాక్టర్, బర్గర్, భోలా మరియు శంకర్ అనే కోడ్‌నేమ్‌లతో చిత్రీకరించబడ్డారు. దీంతో ఈ వెబ్ సిరీస్ మేకర్ అనుభవ్ సిన్హాను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు విమర్శిస్తున్నారు. హైజాకర్లు అందరూ ముస్లిం ఉగ్రవాదులని, హిందూ పేర్లను ఎలా హైలెట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ALSO READ | IC 814: The Kandahar Hijack Review: ఐదుగురు హైజాకర్లు, 189 జీవితాలు, 7 రోజుల భయానకం
ఈ క్రమంలో వెబ్‌సిరీస్‌లో హైజాకర్లకు పెట్టిన పేర్లపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైజాకర్లు ఉగ్రవాదులనే విషయం అందరికీ తెలిసినప్పటికీ వారి వర్గాన్ని కప్పిపుచ్చేలా పేర్లు పెట్టారంటూ బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెబ్‌సిరీస్‌పై తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్న ఆయన ఇప్పుడు కాందహార్ హైజాక్ వెబ్‌సిరీస్‌లో మాత్రం వాస్తవాలే ఉండాలంటున్నారని విమర్శించారు.
Netflix Content Head has been summoned tomorrow by the Ministry of Information & Broadcasting over the 'IC814' web series content row: Sources
— ANI (@ANI) September 2, 2024
ఈ సీరీస్ లో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఐసీ 814 విమానం కెప్టెన్ శరణ్ దేవ్ గా నటించాడు. స్టార్ హీరో అరవింద్ స్వామి.. విదేశాంగ శాఖ సెక్రటరీ శివరామకృష్ణన్ పాత్రలో నటించగా..రా జాయింట్ సెక్రటరీ రంజన్ మిశ్రాగా నటుడు కుముద్ మిశ్రా కనిపించారు.