సీఐఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​ జాబ్స్​

సీఐఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​ జాబ్స్​

సెంట్రల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్ దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్లలో 787 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌‌‌‌మెన్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. పదో తరగతి అర్హతతో మహిళలు, పురుషులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు.

అర్హత :  మొత్తం 787 పోస్టులకు  పదో తరగతి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయసు ఉండాలి.  పురుష అభ్యర్థుల ఎత్తు- 170 సెం.మీ., మహిళా అభ్యర్థుల ఎత్తు- 157 సెం.మీ. ఉండాలి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పీఎస్‌‌‌‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్‌‌‌‌నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ ఇంగ్లిషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌‌‌‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్‌‌‌‌ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​లో డిసెంబర్​ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. సమాచారం కోసం www.cisfrectt.in వెబ్​సైట్ సంప్రదించాలి.