
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టుల భర్తీకి ఏటా నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ విడుదల చేసింది. సీజీఎల్ తర్వాత అతి ఎక్కువ మంది రాసే పరీక్ష సీహెచ్‍ఎస్‍ఎల్. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పోటీ పడతారు. సిలబస్ కూడా విస్తృతంగా ఉంటుంది. ప్లాన్డ్‌గా ప్రిపేరయితే ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిర జాబ్‌లో ఎంటరయ్యే అవకాశం కల్పిస్తోంది సీహెచ్‌ఎస్‌ఎల్.
పోస్టులు:
1) లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
2) పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్
3) డేటా ఎంట్రీ ఆపరేటర్.
సెలెక్షన్ ప్రాసెస్
టైర్-1, 2, 3 అనే మూడు దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొదటిదశలో దేశవ్యాప్తంగా మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. డ్యురేషన్ 60 నిమిషాలు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.50 మార్కు నెగెటివ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్, హిందీలో ముద్రిస్తారు. టైర్- I లో మెరిట్ సాధించిన వారిని టైర్-II లో నిర్వహించే డిస్ర్కిప్టివ్ టెస్ట్‌కు సెలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా ఎంపికైతే చివరిదశలో నిర్వహించే స్కిల్‍టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్టు రాయాల్సి ఉంటుంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ఉత్తీర్ణత.
వయసు: 1 జనవరి 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా మార్చి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
వెబ్సైట్: www.ssc.nic.in
ఎగ్జామ్ ప్యాటర్న్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 50
జనరల్ ఇంటెలిజెన్స్ 25 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 50
జనరల్ అవేర్‌నెస్ 25 50
మొత్తం 100 200