- సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ ఆశ్విని శ్రీవాత్సవ్
కామారెడ్డి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిందని సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ, జిల్లా నోడల్ఆఫీసర్ ఆశ్విని శ్రీవాత్సవ్ పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 2024, జనవరి 26 వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ప్రోగ్రామ్ ప్రారంభించారు. జిల్లాకు చేరిన ప్రచార రథాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించారు.
ఆశ్విని శ్రీవాత్సవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల చెంతకు తీసుకెళ్లడం, అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ ప్రోగ్రామ్ నుచేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. అందులో శానిటేషన్, ఆర్థిక సాయం, ఎల్పీజీ కనెక్షన్లు, ఇండ్లు, ఆహార భద్రత, విద్య, వైద్యం, తాగునీటి సప్లయ్ లాంటి స్కీమ్‌లు ఉన్నాయన్నారు.
జిల్లాలో ఏడు వెహికిల్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల ఆఫీసర్లతో నోడల్ఆఫీసర్సమావేశమయ్యారు. ప్రోగ్రామ్‌లో జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, డీఎస్ వో మల్లికార్జున్, సివిల్సప్లయ్డీఎం అభిషేక్‌సింగ్, సర్పంచ్రత్నాబాయి పాల్గొన్నారు.
నందిపేట : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావ్ కోరారు. శనివారం నందిపేట్మండలంలోని కొండూర్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విఠల్‌రావు మాట్లాడుతూ ఈ యాత్ర డిసెంబరు 16 నుంచి జనవరి 4 వరకు నందిపేట మండలంలో కొనసాగుతుందన్నారు.
ప్రోగ్రామ్‌లో భాగంగా అర్హులైన వారి నుంచి పింఛన్లు, గృహ నిర్మాణాలు తదితర సంక్షేమ పథకాలకు సంబందించి దరఖాస్తులు తీసుకుంటారని జడ్పీ చైర్మన్తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, ఎంపీడీవో నాగవర్ధన్, తహసీల్దార్ఆనంద్కుమార్, స్థానిక సర్పంచ్ ప్రభాకర్, ఎంపీవో కిరణ్ పాల్గొన్నారు.
బాల్కొండ: ప్రతి పౌరుడికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
శనివారం వేల్పూరు మండలం లాక్కోరాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. డీఆర్డీవో చందర్ నాయక్, డీపీవో జయసుధ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు, డీఈఓ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.