చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలో రూ.33కోట్లతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులు స్లోగా సాగుతున్నాయి. ఏడాది కింద ప్రారంభమైన పనులు బిల్లులు రావడం లేదని ఎలక్షన్ల ముందు కాంట్రాక్టర్ నిలిపివేశాడు. దీంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
బుధవారం అర్ధరాత్రి రాయ్పూర్ నుంచి కరీంనగర్ వైపు సలాకతో వెళ్తున్న లోడ్ లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ క్యాబిన్, బాడీ రెండుగా విడిపోయి సలాక చుట్టలు రోడ్డుపై పడిపోయాయి. కాగా సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన సెట్ బ్యాక్ 50 ఫీట్ల లోపు ఉన్న ఇండ్లు కూల్చి డ్రైనేజీ పనులు చేపట్టారు. దీంతో రోడ్డు ఇరుగ్గా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.