పంట వ్యర్థాలు కాలిస్తే 30 వేలదాకా ఫైన్‌.. పొల్యూషన్ కట్టడికి కేంద్రం కొత్త రూల్స్

పంట వ్యర్థాలు కాలిస్తే 30 వేలదాకా ఫైన్‌.. పొల్యూషన్ కట్టడికి కేంద్రం కొత్త రూల్స్

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ కట్టడికి కేంద్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఢిల్లీతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టే రైతులకు పెనాల్టీ విధించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుండటంతో ఇటీవల కేంద్రంపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. 

పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతోనే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఎన్సీఆర్​తో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా పరిధిలో పంట వ్యర్థాలను కాలిస్తే రైతులకు జరిమానా విధించనున్నట్లు తెలిపాయి. 

రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు తన పంట వ్యర్థాలను కాల్చితే రూ. 5 వేలు, 2 నుంచి 5 ఎకరాల్లోపు రైతు దహనం చేస్తే రూ.10 వేలు, ఐదు అంతకంటే ఎక్కువ జాగున్నోళ్లు పంట వ్యర్థాలను తగలబెడితే రూ.30 వేల దాకా పెనాల్టీ విధించనున్నట్లు హెచ్చరించాయి. కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ మేనేజ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టం-2021 కింద తెచ్చిన ఈ కొత్త నిబంధనలు గురువారం  నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.