సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధరల తగ్గింపునకు కేంద్రం చర్యలు

సామాన్యులకు గుడ్ న్యూస్.. ఉల్లి ధరల తగ్గింపునకు కేంద్రం చర్యలు

దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎగుమతి సుంకాన్ని ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరకుల ధరలతో సతమతమవుతోన్న సామాన్యలకు ఉల్లిధరలు మరింత భారాన్ని మోపుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డలు కొనాలంటే సామానుల్యు జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉల్లి ధరల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. 

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న ఉల్లి బఫర్ స్టాక్‎ను హోల్ సేల్ మార్కెట్‎లోకి విడుదల చేసింది. మొత్తం 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసి ధరలను నియంత్రించాలని కేంద్ర నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ  సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉల్లి స్టాక్‎ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ.. ఎగుమతి సుంకాన్ని ఎత్తివేసిన తర్వాత ఉల్లి ధరల పెరుగుదలను గమనించామని తెలిపారు. 

ALSO READ | తెలంగాణ కిచెన్ : దిల్​ ఆకులతో చేసే కొన్ని వంటకాలు

రిటైల్ మార్కెట్‎లో ఉల్లి ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో రేట్లు తగ్గించేందుకు 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ హోల్ సేల్ మార్కెట్లలోకి విడుదల చేశామని వెల్లడించారు. అలాగే ఖరీఫ్ సీజన్‎లో దేశవ్యాప్తంగా ఉల్లి సాగు గణనీయంగా పెరిగిందని.. దీని ద్వారా రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశంలో ఉల్లి ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసకుంటోందని స్పష్టం చేశారు.