కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను: కేంద్ర మంత్రి బండి సంజయ్​

కరీంనగర్ లో రాజకీయ విమర్శలు చేయను: కేంద్ర మంత్రి బండి సంజయ్​
  • అందరితో కలిసి పనిచేస్త 
  • ఈ ప్రాంతం అభివృద్ధే నాకు ముఖ్యం 

కరీంనగర్:  ‘ఇప్పటినుంచి కరీంనగర్​లో రాజకీయ విమర్శులు చేయను. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే  శాశ్వతంగా నిలిచిపోతాయి. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్త’  అని   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుతో కలిసి 14 వ డివిజన్ లో పలు పనులను, పద్మానగర్ లోని 16వ డివిజన్ లో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్’ ను ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వరంగల్​కు ధీటుగా కరీంనగర్ ను​అభివృద్ధి చేస్తామన్నారు. ‘ స్మార్ట్ సిటీ నిధులు అనేక కారణాలవల్ల పూర్తిగా వినియోగం లోకి రాలేదు.  ఇప్పుడిప్పుడే అవన్నీ ఖర్చు చేసి అభివృద్ధి చేసుకుంటున్నం.  కేంద్రం నుండి తప్పకుండా నిధులు తీసుకొస్త . రాష్ట్ర ప్రభుత్వం నుండి  రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటాం.’ అని బండి సంజయ్​ అన్నారు.