కవితకు బెయిల్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విజయం : కేంద్ర మంత్రి బండి సంజయ్

కవితకు బెయిల్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విజయం : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటకు రావటం బీఆర్ఎర్, కాంగ్రెస్ పార్టీల విజయం అంటూ కామెంట్ చేశారు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్. అలుపెరగని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారాయన. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ రావటంపై కాంగ్రెస్ పార్టీకి.. న్యాయవాదులకు అభినందనలు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులురాలు బెయిల్ పై బయటకు వచ్చారు.. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారు అంటూ కామెంట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత బెయిల్ కోసం వాదించిన లాయర్ ను.. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపిందని.. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వటంలో కేసీఆర్ తన అద్భుతమైన రాజకీయ చతురత చూపించారంటూ చురకలు అంటించారాయన. 

Also Read :- ఈ మూడు కారణాలతోనే కవితకు బెయిల్

వైన్ అండ్ డైన్ క్రైంలో భాగస్వాములు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభినందనలు అంటూ ఎక్స్ పోస్టు చేశారు బండి సంజయ్.