వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. కారణం ఏమిటంటే.?

వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. కారణం ఏమిటంటే.?

ఈ మధ్యకాలంలో వికీపీడియా వినియోగం బాగా ఎక్కువయ్యింది. దీంతో నెటిజన్లు తెలియని విషయాల గురించి లేదా వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు వికీపీడియా ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ వికీపీడియాలో కంటెంట్ ని ఎవరైనా ఎడిట్ చెయ్యవచ్చు. దీంతో కొందరు తప్పుడు సమాచారం అందిస్తూ నెటిజన్లని తప్పుదోవ పట్టిస్తున్నారు.

వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెబ్​సైట్  కంటెంట్ లో తప్పులు ఉన్నాయని అందిన ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపింది. వికీని పబ్లిషర్ గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్​ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదని వికీ గతంలో పేర్కొంది.

పరిమిత ఎడిటోరియల్ టీమ్ తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది.  అయితే పక్షపాతంగా సమాచారం ఉంటుందని పలువురు కంప్లైంట్ చేయటంతో కేంద్రం చర్యలు చేపట్టింది. కాగా, ఈ సంస్థ దేశానికి వ్యతిరేకంగా సమాచారాన్ని పొందుపరిచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కూడా గతంలో పలు జాతీయవాద సంఘాలు ఆరోపించిన విషయం తెలిసిందే.