
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) 1458 ఏఎస్సై(స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 4 నుంచి జనవరి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు : మొత్తం 1458 ఉద్యోగాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) పోస్టులు 143, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) ఉద్యోగాలు1315 ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ ఇంగ్లిష్ భాష, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. టెన్త్ స్టాండర్డ్‌లో ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తులు : ఆన్లైన్లో జనవరి 4 నుంచి జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.crpf.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.