హైదరాబాద్, వెలుగు : కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన ‘ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు’ దక్కింది. బుక్పబ్లిషింగ్రంగంలో విశేష కృషి చేస్తున్న వారికి భారత ప్రచురణకర్తల సమాఖ్య ఏటా ఈ అవార్డులు ఇస్తోంది. ఈసారి శ్రీనివాసరావుకు దక్కింది.
న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానంలో శ్రీనివాసరావు పాల్గొని సుప్రీంకోర్టు రిటైర్డ్జస్టిస్ హిమా కోహ్లీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు నవీన్ గుప్తా, ప్రణవ్ గుప్తా, జాతీయ అంతర్జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ కర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.