కరీంనగర్కు మరో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

కరీంనగర్ జిల్లాకు మరో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్‌ నాగరాజు సురేంద్ర(కలం పేరు ఎలనాగ)కు ‘గాలిబ్‌ నాటి కాలం’ అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం(2023) లభించింది. ఈ మేరకు సాహిత్య అకాడమీ ప్రకటించింది.

 2017లో అనువదించిన “గాలిబ్‌– నాటి కాలం” పుస్తకానికి  అనువాద సాహిత్య విభాగంలో 2023 ఏడాదికి కేంద్ర సాహిత్య అవార్డుకు ఎంపికైంది. ప్రముఖ కవి పవన్‌ కె. వర్మ ఇంగ్లిష్ లో రచించిన గాలిబ్‌ ద మ్యాన్‌, ద టైమ్‌ పుస్తకాన్ని తెలుగులో గాలిబ్‌– నాటి కాలం పేరుతో కవి ఎలనాగ అనువదించారు. 

ALSO READ :- తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన

నాగరాజు సురేంద్ర వైద్య వృత్తి నుంచి రిటైరై హైదరాబాద్ లో ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆరుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. గతంలో కవిత్వంలో సి.నారాయణరెడ్డి, బాల సాహిత్యంలో వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్‌, అనువాద సాహిత్య నలిమెల భాస్కర్‌, వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అవార్డులు పొందారు.