
ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని పాకబండ బజార్ లో ఉన్న హార్వెస్ట్ స్కూల్ కు చెందిన బి.శ్రీతనిష్క కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే తపాలశాఖ స్కాలర్షిప్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయినట్లు హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్ తెలిపారు. బి.శ్రీతనిష్క ను శుక్రవారం కరస్పాండెంట్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి, టీచర్లు, స్టూడెంట్స్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.