హైదరాబాద్‌లో రూ.55 లక్షల పాత నోట్లు దొరికాయ్.. అప్పుడు మారిస్తే ఇన్కం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని..

హైదరాబాద్‌లో రూ.55 లక్షల పాత నోట్లు దొరికాయ్.. అప్పుడు మారిస్తే ఇన్కం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని..

అప్పుడెప్పుడో రద్దయిన పాత కరెన్సీ నోట్లను ఇంకా దాచుకున్నారు కొందరు. పాత నోట్లను మార్చుకోండి.. కొత్త నోట్లు తీసుకోండి.. అని ఎన్ని సార్లు ప్రకటనలు చేసినా ఇంకా బయటపడుతున్నాయి. చాలా వరకు బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకున్నారు.  కానీ కొందరు ఇన్నాళ్ల తర్వాత గుట్టుగా పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

Also Read:-హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు..

హైదరాబాద్ లో పాత కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రత్నిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రద్దయిన నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సెంట్రల్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు. నిందితుల నుంచి  రూ. 55 లక్షల52 వేల  పాత కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హుస్సేన్‌ సహా అంజద్‌ఖాన్‌, భాస్కర్‌, షేక్‌ నజీమాను పోలీసులు అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవిఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజమ్మిల్ హుసైన్ టోలీచౌకి ప్రాంతంలో ఎస్ఏ టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. అతను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. 2006 లో వృత్తి రీత్యా దుబాయ్ వెళ్లి 2019లో హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. ఈ సమయంలో అతని కుటుంబం రూ.30 లక్షల కరెన్సీ నోట్లను దాచిపెట్టింది. ఆ నగదు నోట్లు రద్దైన సమయంలో మార్పిడి చేస్తే , ఇన్కమ్ టాక్స్ కట్టాల్సి వస్తుందని నోట్లను మార్పిడి చేయలేదు. పాత నోట్ల మార్పిడి సమయం పూర్తయిన తరువాత వాటిని మార్చేందుకు హుసైన్ ప్రయత్నించగా అడు సాధ్యం కాలేదు. 

హుసైన్ స్నేహితుడు అంజాద్ ఖాన్ వద్ద కూడా రూ.25,52,500 రద్దైన నోట్లు ఉండటంతో ... ఇద్దరు కలిసి నోట్లు మార్చేందుకు ప్రయత్నాలు చేశారు. వారికి పల్తీ భాస్కర్ , షేక్ నసీమా అనే నోట్ల మార్పడి ఏజెంట్లు (5 శాతం కమిషన్ తీసుకొనే) వారు పరిచయం కావడంతో... వారి వద్ద ఉన్న నోట్లను 10 శాతం తక్కువతో  మార్చేందుకు ప్లాన్ చేశారు. మార్చి 15న రాత్రి అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి లోని తాజ్ మహల్ హోటల్ సమీపంలో నోట్లను అమ్మడానికి యత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

వారి వద్ద నుండి రద్దైన వెయ్యి రూపాయల నోట్లు 4338 , ఐదు వందల నోట్లు 2429... మొత్తం రూ.55,52,500 లను సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదు తో పాటు ఆ ముఠాను తదుపరి విచారణ కోసం అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ వెల్లడించారు.